Post Views: 4
Singer | Balu, Chitra |
Singer | Kiavani |
Music | Kiavani |
Song Writer | Bhuvana Chandra |
పల్లవి:
కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
పిటపిటలాడిన పరువపు తళుకులు
అహ అహ అహ అహ అబ్బా… ఇది ఏమి వాన
అబ్బబ్బా… ఇది ఏమి వాన
కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
చినుకులు కావవి మగసిరి పిలుపులు
అహ అహ అహ అహ అబ్బా… ఇది ఏమి వానా
అబ్బబ్బా… ఇది ఏమి వానా
చరణం 1:
రివ్వున కొట్టిన ఓ చినుకూ కసిగా పదమంటే
రైకను తట్టిన ఆ చినుకే రైటు కొట్టమంటే
హత్తుకుపోయిన ఓ చినుకూ వగలే ఒలికిస్తే
చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే
కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణ
ఆ..కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణా
ముదిరే చలిగాలిలోన అదిరే పని మొదలెడదామా
అహ అహ అహ అహ అబ్బా… ఇది ఏమి వాన
అబ్బబ్బా… ఇది ఏమి వాన
కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
చినుకులు కావవి మగసిరి పిలుపులు
అహ అహ అహ అహ అబ్బా… ఇది ఏమి వాన
అబ్బబ్బా… ఇది ఏమి వాన
చరణం 2:
హద్దులు మీరిన ఆవేశం తలుపే తడుతుంటే
అల్లరి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే
తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు
కమ్ముకుపోయిన వేళల్లో గుట్టు దాచవద్దు
ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా
ఆ..ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా
తడిలో అందాల పాప పడితే పులుసౌతది చేప
అహ అహ అహ అహ అబ్బా… ఇది ఏమి వాన
అబ్బబ్బా… ఇది ఏమి వాన
కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
చినుకులు కావవి మగసిరి పిలుపులు
అహ అహ అహ అహ అబ్బా… ఇది ఏమి వాన
అబ్బబ్బా… ఇది ఏమి వాన
Kitukulu Thelisina Song Lyrics In Telugu Song English Lyrics.